హంపి థియేటర్‌లో కొనసాగుతున్న వసంతోత్సవ వేడుకలు

 

సిటీ క‌ల్చ‌ర‌ల్‌, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ :   ఉగాది పండుగను పురస్కరించుకొని సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కళ్యాణ్ హంపి థియేటర్‌లో నిర్వహిస్తున్న వసంతోత్సవ వేడుకలు ఐదవ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య అతిథి సంస్కార భారతి రాష్ట్ర సంఘటన్ మంత్రి నిరంజన్ పాల్గొని సంస్థ అధ్యక్షురాలు పద్మ కళ్యాణితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ..సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ అధ్యక్షురాలు పద్మ కళ్యాణి ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వసంతోత్సవం పేరిట వారం రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కళలతో పాటు కళాకారులను ప్రోత్సహించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. సభకు ముందు ప్రముఖ వయోలిన్ విధ్వంసుడు మధుసూధన్ శిష్యులచే వాయిలిన్, కర్ణాటక సంగీత కచేరీతో పాటు సంచలనా స్కూల్ ఆఫ్ డ్యాన్స్, స్వర గంగా మ్యూజిక్ అకాడమీ గురువులు సుజారిత, సుప్రజ ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. Vasantotsava celebrations continue at Hampi Theater

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page