విద్యార్థులకు జ్ఞాపికలను అందచేసిన వినయ్ కుమార్

హైదరాబాద్, సెప్టెంబర్ 20, అద్దం న్యూస్ : ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా జ్ఞాపికలను అందజేత కార్యక్రమం శనివారం గాంధీనగర్ డివిజన్ అభ్యుదయ పాఠశాలలో జరిగింది. ప్రధాని మోడీ జీవితం, ఆయన ఆలోచనలను ప్రతిబింబించే, చిత్ర లేఖనం, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను, విద్యార్థులకు జ్ఞాపికలను అందచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తొలిసారి ప్రధానమంత్రిగా పోటీ చేసిన సమయంలో నేను మీ ప్రధాన సేవకుడిని అంటూ మోడీ ఆన్న మాటలను గుర్తు చేస్తూ సేవా పక్వాడ కేవలం రాజకీయ వేడుక మాత్రమే కాదన్నారు.ప్రజలలో సేవాభావాన్ని పెంచడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, పర్యావరణ సంరక్షణ, ఆరోగ్యంపై దృష్టి సారించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. సేవే మన ధర్మం అనే నినాదంతో ముందుకు సాగుతున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, సంయుక్త రాణి, పూర్ణ, స్కూల్ ప్రిన్సిపాల్ శైలజ రామ్, టీచర్ లు నాగలక్ష్మి, రచన తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply