అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం  – మంత్రి లోకేష్‌

ఆంధ్ర ప్రదేశ్ బ్యూరో, అద్దం న్యూస్ : అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఏపి మంత్రి నారా లోకేష్‌ అన్నారు. సోమవారం ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుపై ఏపీ శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ4సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు వచ్చేలా యత్నిస్తున్నామన్నారు. అమరావతికి బిట్స్‌ వచ్చేందుకు సిద్ధంగా ఉందని, ఐఐటీ మద్రాస్‌, టోక్యో వర్సిటీ, టీసీఎస్‌తో కలిసి..డీప్‌టెక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విశాఖలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు పీజీ విద్యార్థులకు రీఎంబర్స్‌మెంట్‌ ఇస్తామన్నారు. విద్యారంగంపై శాసనమండలిలో చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లారు ? ఈ విషయాలన్నీ ఆ రోజు చెప్పామని.. మీరెందుకు బాయ్ కాట్ చేశారు ? అని ప్రశ్నించారు. ఆ రోజు జరిగిన చర్చలో ఫీజు రీయింబర్స్ మెంట్ పై చాలా స్పష్టంగా వివరించాం. వినకుండా, చదవకుండా మళ్లీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

వైసీపీ హయాంలో రూ.4,200 కోట్లు బకాయిలు పెట్టారని ..అవునో, కాదో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కచ్చితంగా చెల్లిస్తామన్నారు. చర్చలో వైసీపీ సభ్యులు లేకపోతే నేనేం చేయగలను.. బీఏసీలో విద్యారంగంపై చర్చ కావాలని అడిగితే ఒప్పుకున్నాం.. కానీ ఆ చర్చకు వైసీపీనే లేదు.. వాస్తవాలు వినడానికి వైసీపీ సభ్యులు సిద్ధంగా లేరన్నారు. ఐటీ కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఎటువంటి నిబంధనలు విధించకుండా, రాయితీలు ఇచ్చి, రప్పించే ఫ్రెండ్లీ విధానం అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నామని..ఈ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ‘ఈగల్’ ప్రారంభించామని తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page