గ్రంథాలయంలో మౌళిక వసతులను కల్పిస్తున్నాం
– నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరి పద్మజ
హైదరాబాద్, జనవరి 28, అద్దం న్యూస్ : గ్రంథాలయంలో మౌళిక వసతులను కల్పిస్తున్నామని నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరి పద్మజ అన్నారు. గన్‌ఫౌండ్రి లైబ్రరీలో గత మూడు సంవత్సరాలుగా చదువుకొని ఎస్ఎస్‌సి జిడి కానిస్టేబుల్ ( సిఐఎస్ఎఫ్ ) ఉద్యోగం పొందిన గుడిసె అఖిల్ కు హైదరాబాదు నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరీ పద్మజ సన్మానించారు. ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ… విద్యార్థులు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే ఒక సంకల్పంతో చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ గ్రంధాలయ ఇన్చార్జ్ గ్రంథపాలకుడు సూర్య ప్రకాష్, బొల్లం మహేందర్, రామ్మోహన్, శంకర్, శాఖ గ్రంధాలయంలో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు పాల్గొన్నారు.![]()

![]()














Leave a Reply