...

రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం – టిడిపి నాయ‌కుల స్ప‌ష్టం

రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది అప్రజాస్వామిక వైఖరి
– టిడిపి నాయ‌కుల స్ప‌ష్టం

హైదరాబాద్, మే 17, ( అద్దం న్యూస్ ) :  రానున్న జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంద‌ని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్‌, పి.బాల్‌రాజ్‌గౌడ్‌లు స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఆ పార్టీ నాయ‌కులు నల్లెల్ల‌ కిషోర్, బాల్‌రాజ్ గౌడ్ ల ఆధ్వ‌ర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం జ‌రిగింది. తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లెల్ల‌ కిషోర్ అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా పార్టీ పతాకావిష్కరణ, మా తెలుగుతల్లి గీతాలాపన చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పూర్వ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి, చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ‘జై ఎన్టీఆర్’, ‘ఎన్టీఆర్ అమర్ రహే’, ‘తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి’ అనే నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మారుమోగింది.

ఈ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన మాజీ శాసన సభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ… తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రజాదరణ, క్యాడర్ బలం చెక్కుచెదరలేదని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యులు అర‌వింద్ కుమార్ గౌడ్‌, బ‌క్క‌ని న‌ర్సింహులు ఇద్ద‌రూ జూమ్ ( ఆన్‌లైన్ ) వీడియో ద్వారా, ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడమే తెలుగుదేశం పార్టీ నైజమని, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు సమావేశంలో జూమ్ ద్వారా మాట్లాడుతూ… పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర పరిశీలకులుగా విచ్చేసిన శ్రీపతి సతీష్, పోలంపల్లి అశోక్ మాట్లాడుతూ… రానున్న రోజుల్లో నగరంలో పార్టీని సంస్థాగతంగా ఎలా బలోపేతం చేయాలో దిశానిర్దేశం చేశారు. అదే విధంగా సికింద్రాబాద్ నాయకులు వల్లారపు శ్రీనివాస్, జూబ్లీహిల్స్ నాయకులు జివిజి నాయుడు తదితరులు ప్రసంగించారు. సమావేశంలో ఆమోదించిన కీలక రాజకీయ, ప్రజా సంబంధిత తీర్మానాలు :
తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప‌లు తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించారు. రాష్ట్రంలో రాజకీయ స్తబ్దత – కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అప్రజాస్వామిక వైఖరిపై నిరసన -తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీల వైఖరితో రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని సభ తీవ్రంగా ఖండించింది. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేయాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని సభలో ఉన్న వేలాది మంది ప్రతినిధులు, కార్యకర్తలు లేచి నిలబడి, కరతాళ ధ్వనులతో (చప్పట్లతో) అత్యంత ఉత్సాహంగా బలపరుస్తూ ఆమోదించారు. హైదరాబాద్ మహా నగరానికి ఐటీ వైభవాన్ని, అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించింది నారా చంద్రబాబు నాయుడేనని, నగరాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించాలంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు అత్యంత ఆవశ్యమని సభ అభిప్రాయపడింది. ప్రజాసమస్యలపై తెలుగుదేశం పార్టీ నిరంతరం రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తుందని సభ స్పష్టం చేసింది. విద్యార్థులు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని స‌భ‌ తీర్మానం ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు, క్రియాశీల కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ నామినేటెడ్ పదవులలో తగిన అవకాశాలు కల్పించి, తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆదించి ఆమోదించారు. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.

ఈ విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర కమిటీ నాయకులు అజ్మీర రాజునాయక్, వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ విద్యా సాగర్, పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ సంజయ్, హైదరాబాద్ పార్లమెంట్ నాయకులు న‌గు నగేష్, అన్వర్ తదితర ముఖ్య నేతలు హాజరై ప్రసంగించారు. ఈ స‌మావేశంలో వెంకట్రాజం గౌడ్, ఆర్.మహేందర్ యాదవ్, కాసుల సుదర్శన్ రెడ్డి, తడక వినోద్ నేత, గుట్ట అనిల్ కురుమ, ఎం.శ్యాంసుందర్, కరణం కిరణ్, భాను ప్రకాష్, సిహెచ్ ప్రదీప్ గౌడ్, పి.వంశీకృష్ణ, సూర్యదేవర లత, బాలాజీ గోస్వామి, ఎంఎస్ సిద్ధిఖి, పుప్పాల బాలకృష్ణ, ప్రమీల, ఝాన్సీ, ఎం.నరసింహ, సాంబశివరావు, ఆర్.పి., మల్లిఖారుజన్, సత్యనారాయణ, గండికోట విజయ్, కట్టరాములు, జగదీష్ గౌడ్, ఎస్.ప్రకాష్, శక్తిప్రేమ్, సుక్రవేది, స్వరూపారాణి, విద్యార్థి చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.