షాపు య‌జ‌మానుల‌కు చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తాం – వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రామగిరి హరిబాబు

షాపు య‌జ‌మానుల‌కు చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తాం

– వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రామగిరి హరిబాబు

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 24, అద్దం న్యూస్ :     షాపు య‌జ‌మానుల‌కు చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రామగిరి హరిబాబు అన్నారు. వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో కిరాణా షాప్ లలో అమ్ముతున్నటువంటి వినియోగదారుల సమాచారం అనగా ఫుడ్ లైసెన్స్ లేని చిన్న పిల్లలు తిన్నె పదార్థాల అమ్మకం పై షాపు యజమానులకు అవగాహన కార్య‌క్ర‌మం ముషీరాబాద్ నియోజకవర్గం క‌వాడిగూడ‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పలు కిరాణా షాప్ ఓనర్లకు FSSAI, లీగ‌ల్ మెట్రోల‌జి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియజేస్తూ, తిను పదార్థాల ప్యాకెట్ పైన తయారుదారుడి సమాచారం లేకుండా అమ్మితే వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం – 2019 ప్రకారం వాటికున్న చట్టాలు శిక్షల గురించి తెలియజేస్తూ మెమొరాండం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రామగిరి హరిబాబు మాట్లాడుతూ… ఇటీవలే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలోని పలు బస్తీలలో, కాలనీలలో సంస్థ తరపున సర్వేలు చేశామ‌న్నారు. బస్తీలలో, కాలనీలలో చిన్న కిరాణా నుంచి పెద్ద కిరాణా షాప్ వరకు చిన్నపిల్లలు తిన్నె తిను పదార్థాలు బన్, ఉస్మానియా బిస్కెట్, పాపడాలు, మురుకులు, మిక్చర్, చాక్లెట్స్, స్వీట్స్ లాంటివి తయారీదారుడు వివరాలు అనగా కంపెనీ పేరు పూర్తి అడ్రస్‌తో సహా, గడువు తేదీలు, ఎమ్మార్పీ రేట్లు, FSSAI లైసెన్స్ మార్కెట్‌లో అమ్మడానికి చట్ట ప్రకారంగా ఉండాల్సిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేని వస్తువుల వస్తువుల అమ్మకం పెద్ద మొత్తంలో గమనించామని తెలిపారు. దీని అరికట్టాలంటే వినియోగదారులతో పాటు షాపు యజమానుల సహకారం కూడా ముఖ్యమన్నారు. ఎక్కువ శాతం షాప్ యజమానులకు కూడా చట్టాల పట్ల అవగాహన లేకపోవడం కారణమన్నారు. ఈ లెటర్ రూపంలో వీళ్లకు తెలియజేస్తూ అలాగే షాపు యజమానులకు వచ్చే నెల అక్టోబర్ ఆరో తారీఖున వినియోగదారుల అవగాహన సదస్సును నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, జిహెచ్ఎంసి ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి అధికారులు వచ్చి షాప్‌ల‌లో తిను పదార్థాలు నాసీ రకం వస్తువుల అమ్మకాలపై అవగాహన పరుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం కవాడిగూడలో మొదలు పెట్టామని.. రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని వారానికి ఒక నియోజకవర్గంలో నిర్వహించి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరితో పాటు తెలంగాణ మొత్తం నిర్వహిస్తామని తెలిపారు. దాని తర్వాత ఎవరైనా కిరాణా షాప్‌లో తిరిగి అమ్మడం మొదలు పెడితే ఆ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి శిక్షపడేలా చేస్తామని హెచ్చరించారు. ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు మొహమ్మద్ రఫియుద్దీన్ అధ్యక్షతన జ‌రిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జి.శివకుమార్, వి.రవి, ప్రధాన కార్యదర్శి దుమ్మాటి కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు యు.ప్రభాకర్, కె.రాజు, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రీతి, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు టి.రమేష్, మల్కాజిగిరి పార్లమెంట్‌ ఇంచార్జ్ బి.సంజయ్, ప‌లు నియోజకవర్గాల అధ్యక్షులు రాము, సంతోష్, దేవేందర్, మల్లేష్, నవీన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page