బ్రాహ్మణ సమాజ ఐక్యతే అర్చకుల సంక్షేమానికి శాశ్వత పరిష్కారం

బ్రాహ్మణ సమాజ ఐక్యతే అర్చకుల సంక్షేమానికి శాశ్వత పరిష్కారం
– తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( TYJF ) అధ్యక్షుడు డాక్టర్ జితేందర్ రావు తనుగుల 

హైద‌రాబాద్‌, జూలై 14, ( అద్దం న్యూస్ ) :    అర్చకుల సంక్షేమం.. బ్రాహ్మణ సమాజ ఐక్యతే శాశ్వత పరిష్కారం అవుతుందని సీనియర్ జర్నలిస్టు, ది సౌత్ ఇండియా టైమ్స్ ( ఆంగ్ల దినపత్రిక ) బ్యూరో చీఫ్, తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( TYJF ) అధ్యక్షుడు డాక్టర్ జితేందర్ రావు తనుగుల మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణకు అర్చకుల గౌరవం, సమాజ అభ్యున్నతికి బ్రాహ్మణుల ఐక్యత అత్యావశ్యకమన్నారు. భారతీయ సంస్కృతి, వేద సంప్రదాయం, సనాతన ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణ సమాజం శతాబ్దాలుగా విశిష్టమైన పాత్ర పోషిస్తోందన్నారు. దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు… అవి ఆధ్యాత్మికత, సంస్కృతి, నైతిక విలువలు, సామాజిక సమగ్రతకు ప్రతీకలన్నారు. ఈ మహోన్నత వ్యవస్థకు అర్చకులు, వేద పండితులు, ఆలయాలకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజంలో ధర్మబద్ధమైన జీవన విధానాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, విలువలను భావితరాలకు అందించే పవిత్ర బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని తెలిపారు. 

 దేవాలయాల అభివృద్ధి ఎంత ముఖ్యమో, వాటిని నిత్యం సేవాభావంతో నిర్వహించే అర్చకుల సంక్షేమం కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం, దేవాదాయ శాఖ, భక్తులు, సమాజం గుర్తించాలన్నారు. అదే సమయంలో బ్రాహ్మణ సమాజం కూడా కాలానుగుణంగా ఐక్యతతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. వేదాలు మనకు జ్ఞానం, క్రమశిక్షణ, సేవ, మానవత, సమానత్వం, ధర్మాచరణ వంటి శాశ్వత విలువలను బోధించాయన్నారు. ఆ విలువలను ఆచరించి భావితరాలకు అందించడం ప్రతి బ్రాహ్మణుని ధర్మబద్ధమైన బాధ్యత. ఆధునిక జీవన విధానంలో మార్పులు వచ్చినా ధర్మం, సంస్కృతి, వేద సంప్రదాయాలను పరిరక్షించే కర్తవ్యాన్ని ఎవరూ విస్మరించకూడదని జితేందర్ రావు తెలిపారు. బ్రాహ్మణ సమాజం విద్య, సేవ, సంస్కృతి, ఆధ్యాత్మికత అనే నాలుగు బలమైన స్తంభాలపై నిలబడి దేశ నిర్మాణంలో విశేష సేవలు అందించిందన్నారు. బ్రాహ్మణ సమాజం బలపడితే వేద సంప్రదాయం బలపడుతుంది. వేద సంప్రదాయం బలపడితే సనాతన ధర్మం మరింత సుస్థిరమవుతుందన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page