ముషీరాబాద్ డిపోలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

ముషీరాబాద్ డిపో మేనేజర్ టి.రఘు ఆధ్వర్యంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

హైదరాబాద్, మార్చి 7, అద్దం న్యూస్ :   అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం వేడుక‌లు శ‌నివారం ముషీరాబాద్ ఆర్టీసీ డిపో ఆవ‌ర‌ణ‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌కు ముఖ్య అతితిగా సాయి సంజీవ‌ని హాస్పిట‌ల్ డాక్ట‌ర్‌.ఓంశ్రీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా డాక్టర్. ఓం శ్రీ మాట్లాడుతూ… సమాజంలో మహిళలు ఈ రోజు గోప్ప స్థాయిల్లో ఉన్నార‌న్నారు. రోజు రోజుకు మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ సంద‌ర్భంగా ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘు మాట్లాడుతూ… ఆర్టీసీ సంస్థ‌లో మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక గౌర‌వం ఉంద‌న్నారు. వృత్తిరీత్యా మ‌హిళ‌లు ఆర్టీసీ సంస్థ‌ను ముందుకు తీసుకెళ్ల‌డంతో కీల‌క‌పాత్ర పోషిస్తున్నార‌న్నారు. ఈ సంద‌ర్భంగా మహిళా కండక్టర్లందరిని ప్రోత్సహిస్తూ వారికి చిరు కానుకల‌ను అంద‌చేసి, వారిని ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళా అధికారులు, మహిళా కండక్టర్లు, ఇతర అధికారులు, సూప‌ర్‌వైజ‌ర్లు, డిపో సిబ్బంది పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page