దేవునితోట మోక్ష గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో గ‌ణ‌నాథుడికి పూజ‌లు

దేవునితోట మోక్ష గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో గ‌ణ‌నాథుడికి పూజ‌లు

హైదరాబాద్, ఆగ‌స్టు 27, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ దేవునితోటలోని శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యం ప్రాంగ‌ణంలో గ‌ల శ్రీ శ్రీ శ్రీ మోక్ష గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో బుధ‌వారం వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌య వ్య‌వ‌స్థాప‌కులు దివంగ‌త బొల్లంప‌ల్లి రంగారెడ్డి మ‌న‌వ‌రాలు, ఇండియ‌న్ నేష‌న‌ల్ ట్ర‌స్ట్ ఫ‌ర్ ఆర్ట్ అండ్ క‌ల్చ‌ర‌ల్ హెరిటేజ్ ( ఐఎన్‌టిఎసిహెచ్ ) తెలంగాణ రాష్ట్ర‌, హైద‌రాబాద్ క‌న్వీన‌ర్ అనురాధ రెడ్డి హాజ‌రై ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అలాగే ఆల‌య ప్రాంగ‌ణంలో చెట్ల కింద ఉన్న పురాత‌న వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ఆమె సంద‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య అర్చ‌కులు రామ‌కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page