WPL 2026: మిస్టరీ యాంకర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పంజాబీ బ్యూటీ!

WPL 2026: మిస్టరీ యాంకర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పంజాబీ బ్యూటీ!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మహిళా ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో ఆర్సీబీ ఆఖరి ఓవర్లో ఘన విజయం సాధించింది. అయితే మైదానంలో ఆటతో పాటు, గ్యాలరీలో తన అందంతో మెరిసిన ఓ ‘మిస్టరీ యాంకర్’ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అప్సరసలా కనిపిస్తూ నెటిజన్ల మనసు దోచుకున్న ఆ యాంకర్ పేరే యేశా సాగర్. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఆమె గురించి వెతుకులాట మొదలైంది. యేశా సాగర్ కేవలం యాంకర్ మాత్రమే కాదు, ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె యాంకరింగ్‌తో పాటు మోడలింగ్, నటనలోనూ రాణిస్తున్నారు. యేశా పంజాబ్‌లోని కీరత్‌పూర్ సాహిబ్‌లో జన్మించారు. ప్రస్తుతం ఆమె కెనడాలోని టొరంటోలో నివసిస్తున్నారు. అక్కడ నుంచే తన అంతర్జాతీయ ప్రాజెక్టులు, మోడలింగ్ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

మోడలింగ్ నుంచి మ్యూజిక్ వీడియోల వరకు..

యేశా తన కెరీర్‌ను మోడలింగ్‌తో ప్రారంభించి, గ్లోబల్ మోడల్‌గా గుర్తింపు పొందారు. భారత్, విదేశాల్లో పలు అగ్రశ్రేణి బ్రాండ్‌లకు ఆమె ఫోటోషూట్‌లు చేశారు. పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆమె పలు సూపర్ హిట్ గీతాల్లో నటించారు. ముఖ్యంగా లెజెండరీ సింగర్ బబ్బూ మాన్ సరసన ఆమె చేసిన వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే జోర్డాన్ సంధు వంటి పాపులర్ సింగర్లతోనూ ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఫిట్‌నెస్, సోషల్ మీడియా క్రేజ్

గ్లామర్ రంగంలో ఉన్నప్పటికీ, యేశా ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆమె కఠినమైన వర్కౌట్ రొటీన్‌ను అనుసరిస్తారు. తరచుగా తన హెల్తీ లైఫ్ స్టైల్, వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ప్రోత్సహిస్తుంటారు. సోషల్ మీడియాలో యేశాకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 1.2 మిలియన్లకు పైగా నెటిజన్లు ఫాలో అవుతున్నారు. ఆమె ట్రావెలింగ్, ఫోటోషూట్స్‌కి సంబంధించిన అప్‌డేట్స్ నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్ 2026లో తన యాంకరింగ్‌తో పాటు అందంతోనూ క్రికెట్ ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తోంది ఈ పంజాబీ భామ.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page