అంకుటిత దీక్షతో మెడికల్ సీటు సాధించిన యాతాకుల అక్షర
– ఆత్మకూర్ గ్రామానికి గర్వకారణం
హైదరాబాద్, అక్టోబర్ 2, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లో నివసించే యాతాకుల కుటుంబపు ముద్దుబిడ్డ అక్షర మరో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. ఆత్మకూర్ గ్రామానికి చెందిన యాతాకుల అక్షర పట్టుదలతో కృషి చేస్తూ మెడికల్ ప్రవేశ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచి, రెండో దశ కౌన్సెలింగ్‌లో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ( సిఎంఆర్ఎం ) లో ఎంబిబిఎస్ సీటు సంపాదించింది. యాతాకుల అశోక్–ఉపేంద్రల కుమార్తె అక్షర విద్యాభ్యాసంలో చిన్నప్పటి నుంచే ప్రతిభను ప్రదర్శించింది.
కష్టపడి చదువుతూ నీట్ ( NEET ) పరీక్షలో 360 మార్కులు, 2,92,382 ర్యాంక్ సాధించి వైద్యవిద్యలో అడుగుపెట్టే అవకాశం సొంతం చేసుకుంది. అక్షర విజయంతో ఆత్మకూర్ గ్రామానికి మరో మెడికల్ సీటు రావడం గ్రామ ప్రజలకు గర్వకారణంగా మారింది. గ్రామ పెద్దలు, బంధువులు, స్నేహితులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “అక్షర కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహమే ఈ విజయానికి మూలం” అని అభిప్రాయపడ్డారు. డాక్టరై సమాజానికి సేవ చేయాలన్న అక్షర సంకల్పం. ఈ సందర్భంగా అక్షర మాట్లాడుతూ… నేను సాధించిన ఈ మెడికల్ సీటు వ్యక్తిగత విజయమే కాదని, నా కుటుంబం, నా గ్రామం, నా సమాజం కోసం సాధించిన విజయమని భావిస్తున్నానని తెలిపారు. మంచి వైద్యురాలిగా ఎదిగి పేదలకు, గ్రామానికి సేవ చేయడం నా లక్ష్యం అని తెలిపింది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply