Friday, September 18, 2026
HomecinemaAR Rahman: నటుడిగా రెహమాన్.. ఆ డైరెక్టర్ సినిమాతో వెండితెర ఎంట్రీ!

AR Rahman: నటుడిగా రెహమాన్.. ఆ డైరెక్టర్ సినిమాతో వెండితెర ఎంట్రీ!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) తన అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. దశాబ్దాలుగా తన అద్భుతమైన స్వరాలతో మాయ చేసిన ఈ ‘మొజార్ట్ ఆఫ్ మద్రాస్’, తొలిసారిగా వెండితెరపై నటుడిగా కనిపించనున్నారు. ప్రభుదేవా (Prabhu Deva) హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘మూన్‌వాక్’లో (Moonwalk) రెహమాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో రెహమాన్ (AR Rahman) సంగీత దర్శకుడిగా లేదా తన నిజ జీవిత పాత్రలో కాకుండా, ఒక కల్పిత పాత్రలో కనిపించనుండటం విశేషం. ఆయన ఇందులో ‘కోపంతో ఉన్న యువ దర్శకుడి’ (Angry Young Director) పాత్రను పోషిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. అంతేకాదు ఈ సినిమాలోని మొత్తం ఐదు పాటలను రెహమానే స్వయంగా ఆలపించడం మరో విశేషం.

దర్శకుడు మనోజ్ ఎన్.ఎస్ (Manoj NS) చెప్పిన కథ నచ్చడంతో రెహమాన్ (AR Rahman) ఈ పాత్ర చేయడానికి అంగీకరించారట. ప్రభుదేవా ఈ చిత్రంలో ‘బాబుట్టి’ అనే కొరియోగ్రాఫర్ పాత్రలో నటిస్తుండగా, యోగి బాబు మూడు విభిన్న పాత్రల్లో అలరించనున్నారు. బిహైండ్‌వుడ్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ కామెడీ ఎంటర్టయినర్ 2026 మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రెహమాన్‌ను తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page