కెడి.రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డిల అవినీతి అక్రమాల పై సమగ్ర విచారణ జరిపించాలి
– సమావేశంలో వక్తల డిమాండ్
సోమాజిగూడ, సెప్టెంబర్ 25, అద్దం న్యూస్ : కెడి.రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డి అవినీతి అక్రమాల పై సమగ్ర విచారణ జరిపించి, తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, ఈ నెల 28 న జరిగే ఎన్నికలను వాయిదా వేయాలని వక్తలు డిమాండ్ చేశారు. గురువారం తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్, తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) గౌరవాధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లారా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ బైరాగి, తెలంగాణ విటల్, పృధ్విరాజ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నకిలీ బోగస్ సభ్యత్వాలను గుర్తించి వాటిని రద్దు చేయాలని, నకిలీ సభ్యత్వాల ఆధారంగా చిత్రపురి హౌసింగ్ సొసైటీలో ఇచ్చిన ఇండ్లను తిరిగి వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వల్లభనేని అనిల్, కేడి రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డి సాగిస్తున్న లక్షల, కోట్ల రూపాయల దందాను ఆపాలని డిమాండ్ చేశారు, డబ్బు బలంతో.. అధికార బలంతో ఇదే పద్ధతిని కొనసాగిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని వారు హెచ్చరించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply