అతినగరం సుదేష్ నేత ఆధ్వర్యంలో చలి వేంద్రం ఏర్పాటు
హైదరాబాద్, మే 8, ( అద్దం న్యూస్ ) : కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి అతినగరం సుదేష్ నేత ఆధ్వర్యంలో శుక్రవారం చలి వేంద్రం కేంద్రం ఏర్పాటు అయింది. ఈ చలి వేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చలి వేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాశం అనిల్ కుమార్ యాదవ్, అంజద్, స్వామి, మురళీ మోజస్, నారాయణమూర్తి, గుండు జగదీష్, శంకర్, బోనం ఊర్మిళ, పెండెం శ్రీనివాస్ యాదవ్, మనోహర్ సింగ్, వైపి.రాజు, జయకుమార్, సురేష్, శివ, బాబురావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply