హైదరాబాద్, అద్దం న్యూస్ : మతిస్థిమితం సరిగ్గా లేని యువతి మిస్సింగ్ అయిన ఘటన చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ.నాగరాజు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి…. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ డివిజన్ నాగమయ్యకుంటకు చెందిన చిలుక శంకర్ కు చిలుక సునీత ( 33 ) చెల్లె ఉంది. ఆమెకు మతిస్థిమితం సరిగ్గాలేదు. వివాహం కాలేదు. నాగమయ్యకుంట బస్తీ వద్ద భిక్షాటన చేస్తుంటుంది. ఇదిలా ఉండగా ఈ నెల 19వ తేదీన బయటకు వెళ్లిన సునీత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో చిలుక శంకర్, కుటుంబసభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆమె ఆచూకి తెలియలేదు. దీంతో చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో శంకర్ ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ యువతిని ఎవరైనా గుర్తిస్తే చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్ఐ.నాగరాజు కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply