దక్షిణాదికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : దక్షిణాదికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిజి నరసింహ, విసికె జాతీయ నాయకులు, రెండు తెలుగు రాష్ట్రాల ఇంఛార్జీ బాలాసింగం, హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ (ఎం)రాష్ట్ర నాయకులు డిజి.నర్సింగ్ రావు తెలిపారు. బిజెపి ఆర్ఎస్ఎస్ హిందూ హిందుస్థాన్ అనే నినాదాన్ని అమలు చేస్తూ ప్రజలను విడగొట్టాలని కుట్ర పడుతుందన్నారు. జమిలీ ఎన్నికల పేరుతో పార్లమెంటు సీట్లను ఉత్తరాదిలో పెంచుకోవాలని చూస్తుందని అన్నారు. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాదికి పార్లమెంటు స్థానాల పెంపు వల్ల తీరని నష్టం జరుగుతుందని అన్నారు. 1971 జనాభా ప్రకారమే యధాస్థితిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఆయన డిమాండ్ చేశారు. బిఎల్పీ నాయకులు నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. దక్షిణాది ఉనికికి ముప్పు పొంచి వుంది అన్నారు. తెలంగాణ జనసమితి నాయకులు సలీం మాట్లాడుతూ.. దక్షిణాది వ్యతిరేక పార్టీలను తిరస్కరించాలని పిలుపు నిచ్చారు. ప్రముఖ రచయిత స్కైబాబ మాట్లాడుతూ… తెలంగాణలో ఉత్తరాది దురాక్రమణ మొదలైంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ బాలబోయిన సుదర్శన్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, గద్దర్ ఫౌండేషన్ సెక్రెటరీ సూర్యం మాట్లాడుతూ.. గద్దర్ దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య సాంస్కృతిక తేడాలు వున్నాయని అనేక సభలలో చెప్పాడని గుర్తు చేశారు.

విసికె రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చ దేవేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరిపెల్లి ఆనంద్, రాష్ట్ర కార్యదర్శులు నల్లా రమేశ్, కొయ్యడ కిరణ్, మంచింటి అంజయ్య, రాజేశ్వర్, రాజు, కోశాధికారి దానబోయిన రవి, అధికార ప్రతినిధి తెలంగాణ శ్యాం, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, రైల్వే ఎంప్లాయీస్ నాయకులు జె. రాము తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page