‘టాక్సిక్‌’లో మరో హీరోయిన్‌.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యశ్‌ (Yash) హీరోగా మలయాళ దర్శకురాలు గీతూమోహన్‌దాస్‌ ‘టాక్సిక్‌’ (Toxic) చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. ప్రస్తుతం దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో రుక్మిణి వసంత్‌ (Rukmini Vasanth) ఉన్నట్లు టీమ్‌ ప్రకటించింది. ఇందులో ఆమె మెలిసా అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మోడ్రన్‌ డ్రెస్‌లో పబ్‌లో నడుస్తూ రుక్మిణి కనిపిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్‌ల లుక్‌ను విడుదల చేశారు. ఇప్పుడు రుక్మిణి కూడా అందులో ఉన్నట్లు అధికారికమైంది. దీంతో ఇందులో నలుగురు హీరోయిన్స్ అయ్యారు. నదియా పాత్రలో కియారా కనిపించనుండగా హ్యుమా ఖురేషీ (Huma Qureshi) ఎలిజబెత్‌గా, నయనతార (Nayanthara) గంగ పాత్రలో అలరించనున్నారు. చిన్నారుల కోసం ఎన్నో కథలు తెరకెక్కాయని, ఇది పెద్దలకు సందేశమిచ్చే చిత్రమని యశ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకురానుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page