చిక్క‌డ‌ప‌ల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో అరైవ్ అలైవ్ ( Arrive Alive ) రోడ్డు భద్రతా వారోత్సవాలు

చిక్క‌డ‌ప‌ల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో అరైవ్ అలైవ్ ( Arrive Alive ) రోడ్డు భద్రతా వారోత్సవాలు

చిక్క‌డ‌ప‌ల్లి, ఏప్రిల్ 15, అద్దం న్యూస్ :  అరైవ్ అలైవ్ ( Arrive Alive ) రోడ్డు భద్రతా వారోత్సవాలు హైద‌రాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ చౌర‌స్తా వ‌ద్ద చిక్క‌డ‌ప‌ల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ప్రజా పాలన ప్రగతి ప్రణాలికలో భాగంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో బాల‌ల ర‌హ‌దారి భ‌ద్ర‌తా దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో హెల్మెట్లు ధ‌రించ‌ని రైడ‌ర్ల‌ను ఆపి, వారికి కౌన్సిలింగ్ చేసి వారికి ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ల‌ను ధ‌రించారు.

ఈ సంద‌ర్భంగా చిక్క‌డ‌ప‌ల్లి ట్రాఫిక్ సిఐ ఏడుకొండ‌లు మాట్లాడుతూ… ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే 4 సంవత్సరాల పైబడిన పిల్లలందరికీ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని అన్నారు. తల్లిదండ్రులు తమ ప్రాణ రక్షణకు ఇచ్చే ప్రాధాన్యతనే తమ పిల్లల భద్రతకు కూడా ఇవ్వాల‌న్నారు. పిల్లలకు సరైన పరిమాణంలో ఉండే ( Child-sized ) హెల్మెట్లను వాడటం వల్ల మాత్రమే పూర్తి రక్షణ లభిస్తుందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిహెచ్ఎంసి డిఈ గీత‌, ఎస్ఐ లు ల‌క్ష్మ‌య్య‌, యాద‌గిరి, పోలీస్ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page