Saturday, October 31, 2026
No menu items!
HomeAPప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా వైఫల్యం – తెలుగుదేశం న‌గ‌ర నాయ‌కుడు...

ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా వైఫల్యం – తెలుగుదేశం న‌గ‌ర నాయ‌కుడు నల్లెల్ల కిషోర్ తీవ్ర ఆగ్రహం

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, అక్టోబర్ 30, ( అద్దం న్యూస్ ) :    రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముందస్తు ప్రణాళికలు, కనీస పాలనా స్పృహ లేకపోవడం వల్లే నేడు హైదరాబాద్ మహానగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి, అధిక ధరలు, కరెంట్ కోతలు తలెత్తుతున్నాయని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్‌ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ అన్నారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… రాబోయే వేసవి, ఎల్ నినో ప్రభావం వల్ల నీటి ఎద్దడి ఏర్పడుతుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పుడు జలాశయాలు అడుగంటిపోయాక, సమస్యను పరిష్కరించాల్సింది పోయి, సామాన్య ప్రజలు, వ్యాపారులపై వేల రూపాయల జరిమానాలు విధిస్తూ జలమండలి ద్వారా భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నగరంలో తాగునీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించకుండా, కేవలం ట్యాంకర్ల ట్రాకింగ్, యాప్‌లు, కమాండ్ కంట్రోల్ రూమ్‌ల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారే తప్ప ప్రజల దాహార్తి తీర్చే శాశ్వత పరిష్కారాలు చూపడం లేదని దుయ్యబట్టారు. నిత్యావసరాల ధరలు ఆకాశానికి.. బ్లాక్ మార్కెట్‌కు సర్కార్ అండ ? ఒకవైపు తాగునీటి, కరెంట్ సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేదన్నారు. మార్కెట్‌లో ఒకేసారి బియ్యం, పప్పులు, నూనెల ధరలు రెట్టింపు అవుతున్నా నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

గోదాములు, రైస్ మిల్లుల్లో వ్యాపారులు సరుకులను అక్రమంగా బ్లాక్ చేస్తుంటే ప్రభుత్వం కంటితుడుపు చర్యలు తప్ప శాశ్వత నిరోధక చర్యలు తీసుకోవడం లేదని, ఇది ప్రైవేట్ వ్యాపారులకు ప్రభుత్వం ప్రత్యక్షంగా సహకరించడమేనని ఆరోపించారు. రూ.50 ఉండాల్సిన బియ్యం ధర రూ.100 దాటిపోతుంటే పేదవాడు బుక్కడు అన్నం ఎలా తింటాడని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, నీటి ఎద్దడి, నిత్యావసరాల ధరల మంటతో సామాన్యులు సతమతమవుతుంటే, ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసి, ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఢిల్లీ ధర్నాలు, రాజకీయ ప్రచారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ముందు సొంత రాష్ట్రంలో నీరు, విద్యుత్, నిత్యావసర ధరలను అదుపులోకి తెచ్చి పాలనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని, ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సికింద్రాబాద్ పార్లమెంటు కన్వీనర్ నల్లెల్ల కిషోర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాలరాజ్ గౌడ్, నాయ‌కులు శ్యామ్ సుందర్, తడక వినోద్, భాను ప్రకాష్, కరణం కరణ్, బి.రాజు, శక్తిప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page