Ashika Ranganath: బాలయ్యకు జోడిగా..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ‘అమిగోస్’ తో తెలుగు తెరకు పరిచయమైన ఆషికా రంగనాథ్ (Ashika Ranganath).. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’లోనూ మెరిసింది. ఈ సినిమా విజయం సాధించడంతో మంచి గుర్తింపు దక్కింది. తన అందం, అభినయంతో కుర్రకారు మదిని దోచేసింది. రెండేండ్ల తర్వాత మళ్లీ తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’లో చాన్స్ కొట్టేసింది. దీంతో పాటు మాస్ మహరాజా రవితేజ. సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడికి మరో క్రేజ్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది.

నందమూరి నటసింహ బాలకృష్ణ 111వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులోనూ బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీరి యాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. ఇందులో బాలయ్యకు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు ఆషికా ‘రంగనాథ్‌ (Ashika Ranganath)ను కూడా రంగంలోకి దించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం తమిళంలో కార్తీకి జోడీగా స్పై థ్రిల్లర్ ‘సర్దార్ 2’లో నటిస్తోంది. మిత్రన్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రా డక్షన్ పనుల్లో ఉంది. ఆషికా నటించిన ‘గత వైభవం’ ‘కన్నడ చిత్రం గత నెలలోనే రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page