Wednesday, October 28, 2026
No menu items!
HomeGREATER HYDERABAD‘ అంగన్‌వాడి మిలన్ సేవ ’ లో బండ కార్తీక చంద్రారెడ్డి

‘ అంగన్‌వాడి మిలన్ సేవ ’ లో బండ కార్తీక చంద్రారెడ్డి

📰 Generate e-Paper Clip

తార్నక, సెప్టెంబర్ 30, ( అద్దం న్యూస్ ) :   ‘ సేవా సంకల్ప్ అభియాన్ ‘ కార్యక్రమంలో భాగంగా లాలాపేట డివిజన్ పరిధిలోని ఆర్యనగర్‌లో బిజెపి ఆధ్వర్యంలో ‘ అంగన్‌వాడి మిలన్ సేవ ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్యనగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రానికి విచ్చేసిన ఆమె, అక్కడి చిన్న పిల్లలకు పండ్లు ( అరటిపండ్లు ), బిస్కెట్ ప్యాకెట్లను స్వయంగా పంపిణీ చేశారు. సమాజంలో సేవా భావాన్ని పెంపొందిస్తూ, చిన్నారులు, పేదలకు చేయూతనందించడమే ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లాలాపేట డివిజన్ అధ్యక్షుడు ఉపేందర్ యాదవ్, నాగేశ్వర్ రెడ్డి, పోచయ్య యాదవ్, కొనిజర్ల శ్రీనివాస్, జమ్మికుంట వేణు, కృష్ణమూర్తి, మహిళా కార్యకర్తలు సత్యవతి, సుధా, శ్రీదేవి, శాంతి, స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది బాలమణి, రోజా, చంద్రమణి తో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page