భారత సంస్కృతిని పరిరక్షించేందుకు పుట్టిందే బిజెపి
– బిజెపి సీనియర్ నాయకుడు గడ్డం నవీన్
హైదరాబాద్, ఏప్రిల్ 6, అద్దం న్యూస్ : భారత సంస్కృతిని పరిరక్షించేందుకే బిజెపి ఆవర్భవించిందని ముషీరాబాద్ నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకుడు గడ్డం నవీన్ అన్నారు. బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్ కృష్ణానగర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి గడ్ం నవీన్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా గడ్డం నవీన్ మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడిందన్నారు. అప్పటి నుంచి పార్టీని దేశంలోని ప్రజలందరూ ఆదరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలకృష్ణ, కత్తి లక్ష్మీనారాయణ, బాలయ్య, బాబు గౌడ్, రఘుపతి, రాజు, మహేష్, జై వీర్, నరేష్, ఎం.సత్యనారాయణ, పి.రాకేష్, ఎన్.రాకేష్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు. 











Leave a Reply