Monday, November 2, 2026
No menu items!
HomeGREATER HYDERABADఉద్యమకారుల డిమాండ్లపై కాలయాపన వద్దు – టియు జేఏసి రాష్ట్ర అధ్య‌క్షుడు తుమ్మల...

ఉద్యమకారుల డిమాండ్లపై కాలయాపన వద్దు – టియు జేఏసి రాష్ట్ర అధ్య‌క్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి

📰 Generate e-Paper Clip

బ‌షీర్‌బాగ్‌, న‌వంబ‌ర్ 2, ( అద్దం న్యూస్ ) :     సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి ఉద్యమకారుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని టియు జేఏసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల ప్రపుల రాంరెడ్డి, కళ్లెపు చంద్రన్న ప్రసాద్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమ‌వారం హైద‌రాబాద్‌లోని బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… ఉద్యమకారులకు వయసు పైబడి అనారోగ్యాలతో ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని దినదిన గండంగా జీవితాలను వెల్లదీస్తున్నారన్నారు. అనేక మంది కళ్ళముందే మరణిస్తున్నారని.. ఉద్యమకారుల జీవితాలు భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఉద్యమకారుల జీవితాలతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులను గుర్తించి, సంక్షేమ పథకాలను అమలు చేసి అందించాలని కోరారు. దానికై ఉద్యమకారులు దరఖాస్తు చేసుకోవడానికి ఆఫ్‌లైన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాల‌ని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉద్యమకారులకు వెంటనే కల్పిం చాలన్నారు. ఆఫ్‌లైన్ దరఖాస్తులను కూడా వెంటనే స్వీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తుందని.. ఉద్యమకారుల‌ గుర్తింపు కమిటీని నియమించి ఆరు నెలలు కాబోతుంద‌న్నారు. అభిప్రాయాల సేకరణతో పేరుతో ఈ కమిటీ కాలయాపన చేస్తుందే తప్ప మరొకటి లేదని, 1969 ఉద్యమ కారులు అమరుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

అభివాదం చేస్తున్న టియు జేఏసి రాష్ట్ర అధ్య‌క్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, ఉద్య‌మ‌కారులు

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే గుర్తించి ఆర్థిక భారం లేనటువంటి గుర్తింపు కార్డు, భూమి, ఆరోగ్య భద్రత, విద్యా ఉపాధి, ఉద్యోగ, రవాణా, సంక్షేమాలను వెంటనే అమలు చేసి ఉద్యమకారుల, అమరుల కుటుంబాలకు అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమగ్ర అభివృద్ధి సంక్షేమ చట్టం-2026 ను రూపొందించి చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని, 25 న్యాయమైన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని, సంబంధిత చట్టాలను కూడా చెయ్యాలని కోరుతున్నామన్నారు. ఇంకా కాలయాపన చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల అగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో 1969 తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ జాయింట్ యాక్షన్ కమిటీ అధికార ప్రతినిధి కంచర్ల బద్రి, స్టేట్ జాయింట్ సెక్రెటరీ పుట్టా రంజిత్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎర్ర జాన్సన్, ప్రధాన కార్యదర్శి బాకారం లావణ్య, ఉపాధ్యక్షులు హరి ప్రసాద్ గౌడ్, అంజలి కుమారి, తెలంగాణ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సాహెబ్, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక నాయకులు రవీంద్ర నాయక్, 1969 ఉద్యమకారులు హరగోపాల్, ఎం.శంక‌ర‌రావు, తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ మహిళా నాయకులు టి.పద్మ, ఏ.కవిత, జె.ఈశ్వరమ్మ, తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక నాయకులు ఏముల యాదగిరి, సంపత్ కుమార్, రాజేశ్వరరావు, రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page