తార్నాక, నవంబర్ 2, ( అద్దం న్యూస్ ) :
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బషీర్బాగ్ నుంచి ఎంజే మార్కెట్ వరకు తలపెట్టిన మహా పాదయాత్రకు సోమవారం బీజేపీ సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీరామ్ వెంకట్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు జాతీయ జెండాలతో సుమారు 250 మంది 5 బస్సుల్లో భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్య పరిరక్షణ, కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా లోకతంత్ర బచావో – అరాచకత హటావో అనే నినాదంతో సాగుతున్న ఈ యాత్రకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తార్నాక డివిజన్ అధ్యక్షుడు కరుణాకర్, లేబర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణా గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.![]()






