Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalశ్రీ భవాని శంకర దేవాలయం నూతన ఈవోగా పి.లక్ష్మారెడ్డి

శ్రీ భవాని శంకర దేవాలయం నూతన ఈవోగా పి.లక్ష్మారెడ్డి

📰 Generate e-Paper Clip

శ్రీ భవాని శంకర దేవాలయం నూతన ఈవోగా పి.లక్ష్మారెడ్డి

హైద‌రాబాద్‌, జూన్ 16, ( అద్దం న్యూస్ ) :   400 ఏళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉన్న‌ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ దేవునితోటలోని శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యం ఈవోగా పి.ల‌క్ష్మారెడ్డి మంగ‌ళ‌వారం బాధ్య‌త‌లను స్వీక‌రించారు. ఇది వ‌ర‌కు ఈవోగా ఉన్న జ్యోతి గ్రేన్ బ‌జార్ ధ‌ర్మ‌శాల‌కు బ‌దిలి అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఈవో ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ… భ‌వాని శంక‌ర దేవాల‌యం అభివృద్ధికి త‌న వంతు కృషి చేస్తాన‌న్నారు. ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య సిబ్బంది మిక్కిలినేని సురేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page