Tuesday, November 17, 2026
No menu items!
HomeGREATER HYDERABADనషా ముక్త్ భారత్ – నషా ముక్త్ తెలంగాణ అభియాన్ బలోపేతానికి కమిటీల ఏర్పాటు

నషా ముక్త్ భారత్ – నషా ముక్త్ తెలంగాణ అభియాన్ బలోపేతానికి కమిటీల ఏర్పాటు

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, ( అద్దం న్యూస్ ) :    మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన నషా ముక్త్ భారత్ – నషా ముక్త్ తెలంగాణ అభియాన్ కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడం, భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించడం, ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడం కోసం అల‌య్‌- బ‌ల‌య్ ఫౌండేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశం ఆదివారం ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్.సత్యనారాయణ, ఎన్‌సీఈఆర్‌టీ మాజీ సభ్యుడు, ప్రొఫెసర్ మురళీ మనోహర్, ఆకెళ్ల రాఘవేంద్ర, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, ఇతర విశిష్ట అతిథులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా బండారు ద‌త్తాత్రేయ మాట్లాడుతూ… ప్రచార కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు, అధికారులతో సమన్వయం చేసుకోవడం జ‌రుగుతుంద‌న్నారు. మాదకద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణం కోసం స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, సామాజిక సేవా సంస్థలు, వివిధ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమిష్టిగా పనిచేసేలా చూడడమ‌న్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, ప్రముఖ పౌరులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ప్రచార కార్యక్రమాల ప్రచారకర్తలుగా భాగస్వాములను చేయడం ముఖ్య ఉద్దేశ్య‌మ‌న్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో సమన్వయం చేసుకోవడం, విద్యార్థులను చైతన్య కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం, కౌన్సెలింగ్ సదుపాయాలను ప్రోత్సహించడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

     జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ప్రముఖులు, స్వచ్ఛంద కార్యకర్తలు, మతపెద్దలు, స్థానిక సంఘాలు, సంస్థలను భాగస్వాములను చేస్తామ‌న్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు, అవగాహన సమావేశాలు, ర్యాలీలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మీడియా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామ‌ని పేర్కొన్నారు. ఈ కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా, చైర్మన్లు, కో-ఆర్డినేటర్లు, సభ్యులతో కూడిన కింది మూడు కమిటీలను ఫౌండేషన్ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

కమిటీల ఏర్పాటు – కార్యాచరణ ప్రారంభం :
నషా ముక్త్ భారత్ జాతీయ లక్ష్యానికి తన వంతు సహకారం అందిస్తూ, నషా ముక్త్ తెలంగాణ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి మరింత బలోపేతం చేసేందుకు అలై బలై ఫౌండేషన్ పలు కార్యాచరణ చర్యలు చేపడుతోందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రచార లక్ష్యాలను పటిష్టమైన సమన్వయంతో, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికగా అమలు చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి క్రియాశీలం చేయాలని సమావేశంలో నిర్ణయించడం జ‌రిగింద‌న్నారు.

ఏర్పాటు చేసిన కమిటీలు :
విశ్వవిద్యాలయాలు, కళాశాలల సమన్వయ కమిటీ చైర్మన్‌గా మురళీ మనోహర్, కో-ఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ రాజిరెడ్డి, సభ్యులుగా విశ్వనాథ్, రంజిత్ మోహన్, వెంకట్ రెడ్డి, జయదేవ్ శీలం, శ్రీకాంత్ నియ‌మితుల‌య్యారు. సినిమా, సోషల్ మీడియా, సాహిత్యం, పాటల సమన్వయ కమిటీ చైర్మన్‌గా సత్యనారాయణ, కో-ఆర్డినేటర్‌గా వంటిపల్లి భారతి, స‌భ్యులుగా శ్రీ అక్కెల్ల రాఘవేంద్రరావు, కృష్ణ ప్రదీప్, హరిబాబు, పెరిక సురేష్, క్రీడా రంగ ప్రతినిధి, వృత్తి నిపుణుల సమన్వయ కమిటీ చైర్మన్‌గా చక్రపాణి, కో-ఆర్డినేటర్‌గా సందీప్, సభ్యులగా బాల్డ అశోక్, డాక్టర్ అవుల రామచందర్, జి.యోగానంద్, ఎల్.ప్రభాకర్ రెడ్డి, గోపాల్ శర్మ, డాక్టర్ సురేందర్ నియ‌మితుల‌య్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ.పెద్దిరెడ్డి, జనార్దన్ రెడ్డి, అజయ్ మిశ్రా, డాక్టర్ రష్మీ కాండ్లికర్, డాక్టర్ సురేష్ గౌడ్ గా నియ‌మితుల‌య్యారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page