Tuesday, November 17, 2026
No menu items!
HomeGREATER HYDERABADనిరుద్యోగుల అరెస్టులతో రాహుల్ గాంధీ పర్యటన సిగ్గుచేటు – కయ్య వెంకటేష్

నిరుద్యోగుల అరెస్టులతో రాహుల్ గాంధీ పర్యటన సిగ్గుచేటు – కయ్య వెంకటేష్

📰 Generate e-Paper Clip

చిక్క‌డ‌ప‌ల్లి, ( అద్దం న్యూస్ ) :

నిరుద్యోగుల శాంతియుత ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వకుండా, అధికార పార్టీలకు పోలీసు బందోబ‌స్తుతో కూడిన ర్యాలీలకు, ధర్నాలకు అనుమతి ఇవ్వడం బాధాకరమ‌ని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి నాయ‌కుడు క‌య్య వెంక‌టేష్ అన్నారు. రాహుల్ గాంధీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మూడేళ్లు గడుస్తున్న కనీసం 20వేల ఉద్యోగాలు భర్తీ చేయకుండా తెలంగాణలో పర్యటిస్తున్న సంద‌ర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరుద్యోగ యువతను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. ఇందులో భాగంగా క‌య్య వెంక‌టేష్‌, కిర‌ణ్ రాథోడ్ త‌దిత‌రుల‌ను పోలీసులు ముంద‌స్తుగా అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి నాయకుడు కయ్య వెంకటేష్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రశ్నించడం యువత చేసిన తప్పా ? అని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అమలు గురించి ప్రశ్నించే హక్కు నిరుద్యోగులకు లేదా ? అని ఆయన ప్రశ్నించారు.

      ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న పాలకులు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వారి గొంతును పోలీసుల ద్వారా నొక్కే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. నిరుద్యోగుల పై పెట్టిన ఆంక్షలు, అక్రమ నిర్బంధాలను వెంటనే నిలిపివేయాలని, అరెస్టు చేసిన నిరుద్యోగులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఎలక్షన్ ముందు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టడం సిగ్గుచేటని, ఇప్పటికైనా హామీలు నెరవేర్చాలని తెలిపారు. 

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page