Tuesday, November 17, 2026
No menu items!
HomeGREATER HYDERABADబిర్సా ముండా చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

బిర్సా ముండా చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 15, ( అద్దం న్యూస్ ) :    భారత స్వాతంత్య్ర‌ సమరయోధుడు, గిరిజన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు, భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి ఆదివారం హైద‌రాబాద్ రాంన‌గ‌ర్‌లోని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ నివాసంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా బిర్సా ముండా చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా బండారు ద‌త్తాత్రేయ మాట్లాడుతూ… బిర్సా ముండా భారత స్వాతంత్య్ర‌ పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకుల దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా గిరిజన సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. జల్, జంగల్, జమీన్ హక్కుల కోసం బిర్సా ముండా చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శమని, ఆయన త్యాగం, ధైర్యం, పోరాట పటిమ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావనను పెంపొందిస్తాయని తెలిపారు.

           ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల కల్పనకు విశేష ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. బిర్సా ముండా జయంతిని ‘ జన్‌ జాతీయ గౌరవ్ దివస్ ‘ గా నిర్వహించడం ద్వారా గిరిజన స్వాతంత్య్ర‌ సమరయోధుల త్యాగాలను దేశ వ్యాప్తంగా గుర్తించి గౌరవించడం జరుగుతోందని పేర్కొన్నారు. భగవాన్ బిర్సా ముండా త్యాగం, పోరాట స్ఫూర్తి భారతీయులందరికీ ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఆయ‌న ఆశయాలకు అనుగుణంగా గిరిజన సమాజం విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దత్తాత్రేయ పిలుపునిచ్చారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page