Tuesday, November 17, 2026
No menu items!
HomeGREATER HYDERABADమీనాక్షి ఎలీషియా ఫ్లాట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి –హైకోర్టులో జీహెచ్‌ఎంసీ కౌంటర్‌ దాఖలులో జాప్యంపై...

మీనాక్షి ఎలీషియా ఫ్లాట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి –హైకోర్టులో జీహెచ్‌ఎంసీ కౌంటర్‌ దాఖలులో జాప్యంపై ఆందోళన

📰 Generate e-Paper Clip

హైకోర్టులో జీహెచ్‌ఎంసీ కౌంటర్‌ దాఖలులో జాప్యంపై ఆందోళన
– ఏడాదిగా కౌంటర్‌ దాఖలు చేయకుండా గడువు పొడిగింపులు కోరడంపై అభ్యంతరం
– ఫ్లాట్ల కొనుగోలుదారుల్లో నెలకొన్న అనిశ్చితి
– భవన అనుమతులు, మంజూరైన ప్లాన్లు, కోర్టు కేసు వివరాలు పరిశీలించుకోవాలని సూచన

అబిడ్స్‌, ( అద్దం న్యూస్ ) :     అబిడ్స్‌ గన్‌ఫౌండ్రీ ప్రాంతాల్లోని ‘ మీనాక్షి ఎలీషియా ’ భవనంలోని ఫ్లాట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ హైదరాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షుడు డిపి.శ్రీనివాస్‌ రావు సూచించారు. ఈ భవనానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టులో దాఖలైన ‘ సొసైటీ ఫర్‌ క్రూసేడ్‌ ఎగైనెస్ట్‌ కరప్షన్‌ ’ పిటిషన్‌పై జీహెచ్‌ఎంసీ దాదాపు ఏడాదిగా కౌంటర్‌ దాఖలు చేయకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఆదివారం అబిడ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జీహెచ్‌ఎంసీ అధికారులు పదే పదే గడువు పొడిగింపులు కోరుతూ ఇప్పటి వరకు అధికారిక స్పందన దాఖలు చేయకపోవడంపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఈ జాప్యం కారణంగా ఇప్పటికే ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారితో పాటు కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారిలోనూ అనిశ్చితి నెలకొందని తెలిపారు.

హైకోర్టు తుది తీర్పు వెలువడి, భవనానికి సంబంధించిన చట్టపరమైన పరిస్థితి స్పష్టమయ్యే వరకు కొనుగోలుదారులు తొందరపడి ఆర్థిక లావాదేవీలు జరపవద్దని సూచించారు. ఫ్లాట్లు కొనుగోలు చేసే ముందు భవన నిర్మాణ అనుమతులు, మంజూరైన ప్లాన్లు, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు వివరాలను స్వతంత్రంగా ధ్రువీకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఇకనైనా వాయిదాలు కోరకుండా తక్షణమే హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేయాలని శ్రీనివాస్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో పారదర్శకత, జవాబుదారీ తనాన్ని చాటుకోవాలని కోరారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page