అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. శ్రీలంకతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆమె సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో వికెట్ తీయడం ద్వారా మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు (152) పడగొట్టిన బౌలర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ మేగాన్ షుట్ (151 వికెట్లు) రికార్డును బద్దలు కొట్టారు.
కేవలం బౌలింగ్‌లోనే కాకుండా ఆల్ రౌండర్‌గానూ దీప్తి (Deepti Sharma) అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ టీ20 చరిత్రలో (పురుషుల, మహిళల క్రికెట్ కలిపి) 1000 పరుగులు, 150 వికెట్లు సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న ఆమె.. ఇటీవల భారత్ గెలిచిన 2025 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇటీవల జరిగిన డబ్ల్యూపీఎల్ (WPL) వేలంలో కూడా యూపీ వారియర్స్ జట్టు దీప్తిని (Deepti Sharma) రూ. 3.2 కోట్లకు దక్కించుకోవడం, ఆమె ఫామ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply