ప్రభుత్వం ప్రకటించిన రూ.2 కోట్ల బడ్జెట్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించాలి
– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని
హైదరాబాద్, జనవరి 30, అద్దం న్యూస్ : జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు డివిజన్ల అభివృద్ధి కోసం ప్రకటించిన రూ.2 కోట్ల నిధులతో వెంటనే పనులను ప్రారంభించాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని కోరారు. ఈ మేరకు జిహెచ్ఎంసి కవాడిగూడ సర్కిల్–40 డిఎంసి పుష్పలతను శుక్రవారం కార్పొరేటర్ పావని కలిశారు. డివిజన్‌లో ఉన్న పెండింగ్ అభివృద్ధి పనులపై చర్చించారు. జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు కేటాయించిన 2 కోట్ల రూపాయల నిధులను వెంటనే అభివృద్ది పనుల కోసం టెండర్, ప్రారంభోత్సవాలు చేయాలని కోరుతూ కార్పొరేటర్ పావని డిఎంసికి వినతి పత్రాన్ని అందచేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన డిఎంసి నిధుల మంజూరు కొరకు వెంటనే ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కార్పొరేటర్ పావని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.















Leave a Reply