...

రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవండి

రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవండి

» చిక్కడపల్లి ఏసిపి రమేష్ కుమార్, చిక్కడపల్లి ట్రాఫిక్ సిఐ ఏడుకొండలు

హైదరాబాద్, మార్చి 13, అద్దం న్యూస్ :   రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాల‌ని చిక్కడపల్లి ఏసిపి రమేష్ కుమార్, చిక్కడపల్లి ట్రాఫిక్ సిఐ ఏడుకొండలు అన్నారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ హైద‌రాబాద్ జిల్లా క‌మిటీల ఆధ్వ‌ర్యంలో భ‌గ‌త్‌సింగ్ స్మారక యువజన ఉత్సవాల సందర్భంగా హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిలుగా చిక్కడపల్లి ఏసిపి రమేష్ కుమార్, చిక్కడపల్లి ట్రాఫిక్ సిఐ ఏడుకొండలు, కాచిగూడ సిఐ రాజశేఖర్ లు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రక్తదానం ఇవ్వడంలో యువకులు, విద్యార్థులు ముందుండాలని అన్నారు. యువత సేవ కార్యక్రమల్లో విస్తృతంగా పాల్గొనాలన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతి, నిరుద్యోగం, విద్యా వ్యాపారీకరణ, మాదకద్రవ్యాల వ్యాప్తి వంటి సమస్యలపై యువత ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రశ్నించే యువతే సమాజ మార్పున‌కు మార్గం చూపుతుందన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, విద్యార్థులపై పెరుగుతున్న భారాలు, యువతను మాదకద్రవ్యాల బారిన పడేలా చేస్తున్న శక్తులను ఎదిరించడం ప్రతి చైతన్యవంతమైన విద్యార్థి, యువకుడి బాధ్యత అని అన్నారు.

నేటి యువత వినోద, చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి జీవితాలను ఆగం చేసుకుంటున్నారన్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండాల‌న్నారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిలు కోట రమేష్, వెంకటేష్ మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల‌లో భ‌గ‌త్‌సింగ్ యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాలని విద్యార్థులు, యువత విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐపిఎం బ్ల‌డ్ బ్యాంక్ ఇచ్చార్జి మాదవి, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు అశోక్ రెడ్డి, లెనిన్, జావీద్, రాజయ్య, రజనీకాంత్, ప్రవీణ్, అర్జున్, ఆశ్వక్, మనోజ్, మదన్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.