ఇంజినీరింగ్‌ కాలేజీ బస్సు బోల్తా..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మండికుంట వద్ద ఇంజినీరింగ్‌ కాలేజీ బస్సు బోల్తా పడింది. పాల్వంచ కేఎల్‌ఆర్‌ కళాశాలకు చెందిన బస్సు.. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 69 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page