Ashes: ఇంగ్లాండ్‌దే విజయం..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యాషెస్‌ సిరీస్‌ (Ashes 2025-26)లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. రెండు రోజుల్లోనే ఈ టెస్ట్ మ్యాచ్‌ ముగియడం విశేషం. 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 32.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో ఓపెనర్లు జాక్‌ క్రాలీ 37 (48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), బెన్ డకెట్‌ 34 (26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) చక్కటి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం జాకబ్‌ బెథెల్‌ 40 (46 బంతుల్లో, 5 ఫోర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. బ్రైడన్‌ కార్స్‌ (6), జో రూట్‌ (15), బెన్‌ స్టోక్స్‌ (2) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్‌ (2*; 9 బంతుల్లో), జెమ్మీ స్మిత్‌ (3*; 2 బంతుల్లో) నాటౌట్‌గా నిలిచారు. ఆసీస్‌ బౌలర్లలో స్కాట్‌ బోలాండ్‌, రిచర్డ్‌సన్‌, మిచెల్‌ స్టార్క్‌ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

తొలుత 4/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ జట్టు 34.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 42 రన్స్‌ కలుపుకొని, ఇంగ్లాండ్‌కు 175 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్‌ బ్యాటర్లలో ట్రావిస్‌ హెడ్‌ (46; 67 బంతుల్లో 4 ఫోర్లు) చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. స్కాట్‌ బోలాండ్‌ 6, జేక్ వెదర్లాడ్‌ 5, లబుషేన్‌ 8, ఉస్మాన్‌ ఖవాజా 0, కామెరూన్‌ గ్రీన్‌ 19 పరుగులు చేశారు. స్టీవ్‌ స్మిత్‌ 24* (39 బంతుల్లో 1 ఫోర్‌) నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ 4, జోస్‌ టంగ్‌, బెన్‌స్టోక్స్‌ తలో 2, గస్‌ అట్కిన్సన్‌ 1 వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలిరోజు ఆటలో 20 వికెట్లు నేలకూలిన విషయం తెలిసిందే. అలాగే రెండో రోజు ఆటలో బౌలర్లు 16 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page