Home Hyderabad సమిష్టిగా జ‌ర్న‌లిస్టుల‌ సమస్యలపై పోరాడండి – జర్నలిస్టులకు టీడబ్ల్యూజేఎఫ్ నేత మామిడి సోమయ్య పిలుపు

సమిష్టిగా జ‌ర్న‌లిస్టుల‌ సమస్యలపై పోరాడండి – జర్నలిస్టులకు టీడబ్ల్యూజేఎఫ్ నేత మామిడి సోమయ్య పిలుపు

0
1

సమిష్టిగా జ‌ర్న‌లిస్టుల‌ సమస్యలపై పోరాడండి
– జర్నలిస్టులకు టీడబ్ల్యూజేఎఫ్ నేత మామిడి సోమయ్య పిలుపు

ఖమ్మం, డిసెంబ‌ర్ 14, అద్దం న్యూస్ :   రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సభ్యులైన జర్నలిస్టులంతా సమన్వయంతో సమిష్టిగా ఉండాలని, సమస్యలపై పోరాడాలని ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. జర్నలిస్టుల హక్కుల సాధనే లక్ష్యంగా ఏర్పడిన టీడబ్ల్యూజేఎఫ్ ఎప్పటికీ జర్నలిస్టుల పక్షమే అని, పాలకుల పక్షం కాదని ఆయన స్పష్టం చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ సంఘం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, కేవలం జర్నలిస్టుల సంక్షేమం, రక్షణే ధ్యేయంగా సమస్యలపై పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా తృతీయ మహాసభ ఘనంగా జరిగింది. జిల్లా అడ్ హక్ కమిటీ కన్వీనర్ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో మామిడి సోమయ్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

                ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఖమ్మం జిల్లాలో ఉన్న సంఘం బాధ్యులు, సభ్యులు సంఘం నియమ నిబంధనలకు లోబడి పని చేయాలని, అదే విధంగా బాధ్యతతో వ్యవరించి స్థానిక జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. సంఘం బాధ్యులెవరైనా సరే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, తప్పులు చేసి సంఘం పరువుతీస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

                     భవిష్యత్తులో మనమీద బాధ్యతలు చాలా ఉన్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా జర్నలిస్టుల సమస్యలను ఇంత వరకు పరిష్కరించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కరించకుండా అన్యాయం చేసిందని, అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తుందని ధ్వజమెత్తారు. టీడబ్ల్యూజేఎఫ్ సంఘం ఏ రాజకీయ పార్టీకో లేక ఏ ఒక్క మీడియా సంస్థకో అనుబంధం కాదని, జర్నలిస్టులందరికి సంబంధించిన సంఘం అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ మహాసభలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఐఎఫ్‌డ‌బ్ల్యూజే ) కార్యదర్శి ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్లు జగన్, శ్రీనివాస్, బాపురావు, వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి.రాజేందర్, జానయ్య, ఖమ్మం జిల్లా ఫెడరేషన్ నాయకులు రామకృష్ణ, అర్వపల్లి నగేష్, శ్రీనివాస్, సామ్రాట్, జిల్లా కమిటీ లీగల్ అడ్వయిజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన కమిటీ ఎన్నిక :

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాలులో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
( టీడబ్ల్యూజేఎఫ్ ) తృతీయ మహాసభలో సంఘం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా టి.సంతోష్ చక్రవర్తి, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, మనోహర్, బండి కుమార్, కార్యదర్శిగా రామకృష్ణ, సంయుక్త కార్యదర్శులుగా నాగేశ్వర రావు, భద్రయ్య, రవి కుమార్, కోశాధికారిగా నగేష్ లు ఎన్నికయ్యారు. వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఉపేందర్, శ్రీధర్, మధు, నాగకృష్ణ, రమేష్, శిల్ప, స్వాతి తదితరులు ఎన్నికయ్యారు. అదే విధంగా తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ( టీబీజేఏ ) జిల్లా అధ్యక్షుడిగా సామ్రాట్ ఎన్నికయ్యారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page