...

కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై..?

కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై..?
– త్వ‌ర‌లో బిఆర్ఎస్ పార్టీలోకి జీవ‌న్‌రెడ్డి చేరేందుకు ముహుర్తం ఖారారు ?

అద్దం న్యూస్‌, వెబ్ డెస్క్ :    త్వరలో పార్టీకి రాజీనామా చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు స‌మాచారం. గత కొంతకాలం నుంచి.. కాంగ్రెస్ పెద్దలపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ మేరకు ఆయన హాట్‌ కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌ ఏంటో గోచరించడం లేదని, అవమానాలు ఇంకెంతకాలం భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ.. ఛైర్మన్‌ పదవి ఎవరికి ఇస్తారన్న దానిపై ప్రతిష్టంభన ఏర్పడింది.

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎంపికలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఆయన ప్రతిపాదనలను పార్టీ ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా జీవన్‌ రెడ్డికి బద్ధశత్రువు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆయన వర్గానికే చైర్ పర్సన్‌ అవకాశం ఇచ్చారు. దాంతో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లను పార్టీ పక్కన పెట్టడంపై జీవన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అవమానాలు ఇంకెంత కాలం భరించాలని ప్రశ్నించారు. ఈ ఎన్నిక ముగింపు కాదు, ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంత కాలం నాకు వేధింపులు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వరుస అవమానాల నేపథ్యంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా.. లేక పార్టీకి గుడ్ బై చెబుతారా అనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద మాజీమంత్రి జీవ‌న్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన గులాబీ బాస్ కేసీఆర్‌ను కలుస్తారని సమాచారం. ఒకట్రెండు రోజుల్లో కేసీఆర్‌ను ఫాం హౌస్‌లో కలుస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌ధ్యంలో ఉగాది తర్వాత ఆయ‌న పార్టీ మారే అవకాశం ఉంద‌ని.. బిఆర్ఎస్ లో చెరొచ్చని జోరుగా ప్రచారం జ‌రుగుతుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.