పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా
ఉచిత కంటి వైద్య శిబిరం
హైదరాబాద్, సెప్టెంబర్ 25, అద్దం న్యూస్ : పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివి.గిరినగర్ కమ్యూనిటీహాల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ… పేదల సేవకు పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ ఇచ్చిన ప్రాధాన్యం మనకు ప్రేరణను ఇస్తూనే ఉంటుందన్నారు. ఒక అసాధారణమైనటువంటి ఆలోచనపరుడిగా, ఒక మేధావిగా కూడా ఆయనను దేశ వ్యాప్తంగా స్మరించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.నవీన్, ఆనంద్‌రావు, బిజెపి నాయకులు శ్రీకాంత్, దామోదర్, ఉమేష్, సాయి కుమార్, సాయి యాదవ్, విజయ లక్ష్మి, సంధ్యా రాణి, వైద్యులు డాక్టర్ శ్రీ రామ్, వైద్య సహాయకులు అవినాష్, కీర్తన తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply