హైదరాబాద్, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ : జీవీఆర్ కరాటే ఆకాడమి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ సోమవారం నుంచి కాచిగూడలోని అకాడమిలో షార్ట్ హ్యాండ్‌లో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆకాడమీ డైరెక్టర్ డాక్టర్ జిఎస్.గోపాల్ రెడ్డి తెలిపారు. 15 సంవత్సరాలు పై బడిన విద్యార్థులకు ప్రామాణిక మెథడాలజీ, వేగవంతమైన లిపి, రచనా నైపుణ్యాలు, ప్రాక్టికల్ ప్రాక్టీస్‌తో కూడిన సమగ్ర శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు సెల్: 9494112424 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply