...

Gold Prices: 2025 చివరి ప్రియులకు ఊరట: భారీగా తగ్గిన వెండి ధరలు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఈ ఏడాది 2025 సంవత్సరం ముగింపు వేళ బులియన్ మార్కెట్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏడాది పొడవునా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం (Gold Prices), వెండి ధరలు డిసెంబర్ 31న తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు (Profit Booking) దిగడంతో వెండి ధరల్లో భారీ పతనం నమోదైంది.

ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో వెండి (Silver Prices) ఫ్యూచర్స్ ఏకంగా 4.63 శాతం తగ్గి కిలో రూ.2,39,395 వద్ద ట్రేడవుతుండగా, బంగారం (Gold Prices) ఫ్యూచర్స్ 0.51 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1,35,973 వద్ద కొనసాగుతోంది. అయినప్పటికీ 1979 తర్వాత బంగారం ధరలకు ఇదే అత్యుత్తమ సంవత్సరం. 2025లో దేశీయంగా బంగారం ధరలు 76 శాతం పెరగగా, వెండి ఏకంగా 135 శాతం లాభపడింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్ల కారణంగా ఏడాది మొత్తం పసిడి (Gold Prices) పరుగులు పెట్టింది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు మారడంతో చివరి రోజున ధరలు కాస్త తగ్గాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఏడాది కూడా మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని అంచనా.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.