...

క్రీడారంగానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలి – డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : క్రీడలు యువతలో స్నేహాభావాన్ని పెంపొదిస్తాయని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ అన్నారు. భగత్‌సింగ్‌ స్మారక యువజనోత్సవాల సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముషీరాబాద్ జోన్ భరత్‌న‌గ‌ర్‌లో వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో క్రీడాపోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒకవైపు విద్యార్థి యువజనుల హక్కులకై ఉద్యమాలు, పోరాటాలు చేస్తూనే మరోవైపు యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను, నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఈ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ముందుంటుందన్నారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు హ్మాస్మి బాబు, జావీద్, నాయకులు రాజయ్య, దేవేందర్, ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు మహేందర్, ఆర్.వెంకటేష్, విజయ్ కుమార్, శ్రీ రాములు, ఆంజనేయులు, జగన్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.