Govt Jobs: ఎంపీసీఐఎల్ రిక్రూట్‌మెంట్.. రూ.55,000 జీతంతో పోస్టులు!

Govt Jobs: ఎంపీసీఐఎల్ రిక్రూట్‌మెంట్.. రూ.55,000 జీతంతో పోస్టులు!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Govt Jobs) కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) శుభవార్త తెలిపింది. టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 114 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 15 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు:

సైంటిఫిక్ అసిస్టెంట్ / బి (సివిల్): 02 పోస్టులు (జీతం: నెలకు రూ.55,932)
స్టైపెండరీ ట్రైనీ / టెక్నీషియన్: 95 పోస్టులు (జీతం: నెలకు రూ.34,286)
అసిస్టెంట్ గ్రేడ్ 1: 15 పోస్టులు (జీతం: నెలకు రూ.40,290)
ఎక్స్-రే టెక్నీషియన్: 02 పోస్టులు (జీతం: నెలకు రూ.40,290)

అర్హతలు:

అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2026 ఫిబ్రవరి 4 నాటికి 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

అర్హులైన వారు NPCIL అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రక్రియ జనవరి 15, 2026 న ప్రారంభమై, ఫిబ్రవరి 4, 2026 తో ముగుస్తుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఫీజు మినహాయింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక (Govt Jobs) జరుగుతుంది. కాబట్టి అర్హత గల అభ్యర్థులు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page