Wednesday, October 28, 2026
No menu items!
HomeGREATER HYDERABADహౌస్‌ఫెడ్‌ అధికారుల సేవలు అభినంద‌నీయం

హౌస్‌ఫెడ్‌ అధికారుల సేవలు అభినంద‌నీయం

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్ 1, ( అద్దం న్యూస్ ) :     తెలంగాణ హౌస్‌ఫెడ్‌ చైర్మన్‌ కె.నవనీతరావు, జాయింట్‌ రిజిస్ట్రార్‌ ఏ. పూర్ణచంద్రరావు బాధ్యతల నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ‌ సందర్భంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హౌస్‌ఫెడ్‌ ఉద్యోగులు, సిబ్బంది ఆధ్వర్యంలో అభినందన, సన్మాన కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హౌస్‌ఫెడ్‌ ఎండీ లక్ష్మీబాయి హాజరై కె.నవనీతరావు, ఏ.పూర్ణచంద్రరావులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీబాయి మాట్లాడుతూ… హౌస్‌ఫెడ్‌లో బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఉద్యోగులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి వారు అందించిన సేవలు అభినందనీయమన్నారు. వారి అనుభవం, సేవా స్ఫూర్తి సంస్థతో పాటు సహచరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

అనంతరం ఉద్యోగులు, సిబ్బంది వారిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. హౌస్‌ఫెడ్‌ మాజీ ఎండీ రవీందర్‌రెడ్డి, మాజీ డైరెక్టర్లు కిషన్‌రావు, బాలరాజును కూడా సన్మానించారు.కె.నవనీతరావు, ఏ.పూర్ణచంద్రరావు లు మాట్లాడుతూ… తమ బాధ్యతల నిర్వహణలో సహకరించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. హౌస్‌ఫెడ్‌లో పని చేసిన సమయంలో సహచరుల నుంచి లభించిన సహకారం, అనుభవాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని చెప్పారు. సంస్థతో తమ అనుబంధం కొనసాగుతుందని, అవసరమైన సందర్భాల్లో తమ అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌస్‌ఫెడ్‌ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page