గుత్తిటౌన్‌లో ఆటో డ్రైవ‌ర్ల భారీ ర్యాలీ – ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే – గుంత‌క‌ల్లు ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం

గుత్తిటౌన్‌లో ఆటో డ్రైవ‌ర్ల భారీ ర్యాలీ 

ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే

– గుంత‌క‌ల్లు ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం


అనంతపురం, అక్టోబ‌ర్ 5, అద్దం న్యూస్ :    ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిన ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబు నాయుడిదే అని గుంత‌క‌ల్లు ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు డ్రైవర్లకు సేవలో పథకం ఆదివారం ప్రారంభించడం జరిగింది. గుంతకల్ పట్టణంలో ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ఆటో ర్యాలీలో గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి లు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఫొటోస్ తో బ్యానర్ అలంకరించి, గుత్తి, పామిడి, ఇన్చార్జిగా ఉన్న టిడిపి నాయకులు గుమ్మనూరు ఈశ్వర్ సమక్షంలో గుత్తి టౌన్ గాంధీ సర్కిల్ బంగ్లా నుండి ఎన్టీఆర్ సర్కిల్ వ‌ర‌కు భారీగా ఆటో డ్రైవర్లు కలిసి తెలుగుదేశం జెండాలు అలంకరించుకొని ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ వ‌ద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆటో డ్రైవర్లతో కలిసి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం భోజనం చేసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వ‌ద్ద ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ… శ్రీ శక్తి పథకం అమలుపరిచిన నాటి నుండి ఉచిత బస్సు సౌకర్యం కారణంగా ఆటో డ్రైవర్లకు చాలా నష్టం వాటిల్లిందన్నారు. ఆ విష‌యాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు అండగా నిలిచేందుకు అనంతపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ కార్యక్రమంలో దసరా పండుగకి ఆటో డ్రైవర్లకు 15 వేల రూపాయలు ఇస్తానని చెప్పిన విధంగా ఈ రోజున 15 వేల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఒక్కొక్కరికి 15000 చొప్పున దాదాపు రెండు లక్షల రూపాయ‌ల‌ను 90,234 మంది ఆటో డ్రైవర్లకు మంజూరు చేశారని, ఈ లెక్కన ఏడాదికి దాదాపుగా 435 కోట్లు రూపాయలు పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ సంద‌ర్భంగా యువ నేత ఈశ్వర్ మాట్లాడుతూ… టిడిపి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న కూటమి ప్రభుత్వం గొప్పదన్నారు. అనంతపురం జిల్లా బీరప్ప మ్యారేజ్ బ్యూరో నారాయణ, గుత్తి పట్టణ అధ్యక్షులు ఎంకె.చౌదరి, గుత్తి మండల అధ్యక్షుడు బి.లక్ష్మీరంగయ్య యాదవ్, సీనియ‌ర్ నాయ‌కుడు హెచ్ఎం.బాష, గుంతకల్లు పట్టణ, మండల కూటమి నాయకులు కార్యకర్తలు ఆటో డ్రైవర్ల యూనియన్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page