Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఎంఆర్‌పిఎస్ నాయ‌కుడు గ‌జ్జెల ద‌యానంద్ మృతి

ఎంఆర్‌పిఎస్ నాయ‌కుడు గ‌జ్జెల ద‌యానంద్ మృతి

📰 Generate e-Paper Clip

ఎంఆర్‌పిఎస్ నాయ‌కుడు గ‌జ్జెల ద‌యానంద్ మృతి

హైద‌రాబాద్‌, జూన్ 16, ( అద్దం న్యూస్ ) :   మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి ( ఎంఆర్‌పిఎస్ ) ఉద్య‌మ నాయ‌కుడు, మాదిగ ఎంప్లాయీస్‌ ఫోరం ( ఎంఈఎఫ్ ) హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గ‌జ్జెల ద‌యానంద్ ( 68 ) అనారోగ్యంతో మంగ‌ళ‌వారం మృతి చెందారు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కొడుకులు, కూతురు ఉన్నారు. ఆయ‌న గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతున్నాడు. మంగ‌ళ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ హ‌రిన‌గ‌ర్‌లోని ఆయ‌న నివాసంలో మృతి చెందారు. బ‌న్సిలాల్‌పేట స్మ‌శాన వాటిక‌లో ద‌యానంద్ అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి.

ఈ అంతిమయాత్రలో మాదిగ కళామండలి ( ఎంకెఎం ) జాతీయ అధ్యక్షుడు అశోక్ మాదిగ‌, ఎంఆర్‌పిఎస్ నాయ‌కులు గండి కృష్ణ మాదిగ‌, సత్య నారాయణ మాదిగ, యాదయ్య మాదిగ, మదిలేటి మాదిగ, విఎస్‌.రాజు మాదిగ, చిలక ఎల్లయ్య మాదిగ, ఎంఆర్‌పిఎస్‌, ఎంఎస్‌పి ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జ్ గ‌జ్జల రాజశేఖర్ మాదిగ, ఎంఎస్‌పి జిల్లా అధ్యక్షుడు నరసింహ రావు మాదిగ, డప్పు మల్లికార్జున్ మాదిగ, మునిరాతి అరుణ్ మాదిగ, తాండ్ర మురళి మాదిగ, నరసింహస్వామి మాదిగ, రవి మాదిగ, శివ మాదిగ, వినాయక రావు మాదిగ, దశరధ్ మాదిగ, రాములు మాదిగ, వాసు మాదిగ, దేశ్ పాండే, నాగరాజు మాదిగ, తొట్ల గోపి మాదిగ, గజ్జల వినయ్ మాదిగ, బర్ల రమేష్ మాదిగ, శివ ప్రసాద్ మాదిగ త‌దిత‌రులు హాజ‌రై ద‌యానంద్ మృత‌దేహానికి నివాళుల‌ర్పించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page