ప్రజాహిత యాత్రల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న మీనాక్షి నటరాజన్
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, ఆగస్టు 01, అద్దం న్యూస్ : ప్రజాహిత యాత్రలంటూ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని, అధికార దుర్యినియోగానికి పాల్పడుతూ పాదయాత్రలు నిర్వహించడం విచారకరమని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాయలంలో ఆయన మాట్లాడుతూ… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. బిసి రిజర్వేషన్ల కొరకు చేసే ఆర్డినెన్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, రాజ్యంలోని 9 షెడ్యూలును సవరించి అంటే రాజ్యాంగ సవరణ చేస్తే గాని 50 శాతానికి మించి రిజర్వేషన్లు సాధ్యం పడదని అన్నారు. గతంలో ఇదే విషయాన్ని కోర్టులు కూడా స్పష్టం చేశాయన్నారు. అయినప్పటికీ బీసీలకు ఏదో చేస్తున్నామని నటిస్తూ… దానికోసం ఢిల్లీకి పోతాము. ప్రధాన మంత్రి గారిని కలుస్తామని, ధర్నాలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ ప్రజా పాద యాత్రల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా ప్రజలకు చేసిందేమీ లేదని, రైతు రుణమాఫీ 30, 40 శాతానికి మించి ఎవరికి ఏ రైతుకు ఇచ్చినా దాఖలాలు లేవని.. రుణమాఫీ చేసింది లేదన్నారు. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని దానికి దిక్క లేదని మండిపడ్డారు. షాదీ ముబారక్ కళ్యాణమస్తు పథకం కింద తులం బంగారం ఇస్తామని దానికి గతి లేదని దుయ్యబట్టారు. లెక్కలేనన్ని ఎన్నో హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ప్రజలకు చేసిన హామీల పట్ల ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసిన పనులన్నింటి పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తిరిగి మరోసారి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజాహిత యాత్రల పేరుతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది ప్రజా హిత యాత్ర కాదు ప్రజా వంచన యాత్రగా అభివర్ణించారు. ఈ పాదయాత్రలను ప్రజలు విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసారు. రాష్ట్రంలో అనేకమైన సమస్యలున్నాయని, నెల వారి జీతాలు కూడా ఇవ్వలేని అసమర్ధ పాలనలో ఉన్నారన్నారు. యూరియా కొరతతో రైతులు ( నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్ ) రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం యూరియా కొరతలేదని ప్రభుత్వం అబద్ధాలు చెప్పి కాలం గడుపుతున్నారని విమర్శించారు. కులగణన నా పేరుతో 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టి, 56 శాతంగా ఉన్న బీసీలను 42 శాతం కుదించి, దాంట్లో పది శాతం మైనారిటీల పేరుతో మాయమాటలు చెబుతూ, కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారన్నారు. బలహీన వర్గాల కొరకు ఏమైనా చేసిందంటే కేవలం తెలుగుదేశం పార్టీని గుర్తు చేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మరియు జాతీయ అధ్యక్షులు ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హయాంలో విశ్వనగరంగా వెలుపొందిన హైదరాబాద్ నేడు అక్రమాలకు, దౌర్జన్యాలకు మాదక ద్రవ్యాలకు నిలయంగా అడ్డాగా మారి, పబ్బులతో విశృకలత్వంతో నాశనం చేసారన్నారు. ఒకపక్క డెంగ్యూ వంటి రోగాలతో ప్రజారోగ్యం కుంటుపడి ఆందోళనకర స్థితిలో ఉంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధి సంక్షేమాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply