మోడి సభను విజయవంతం చేయాలి
– బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్
హైదరాబాద్, మే 2, ( అద్దం న్యూస్ ) : మోడి సభను భారీ జనసమీకరణతో విజయవంతం చేయాలని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. ఈ నెల 10వ తేదీన నగరానికి మోడి వస్తున్న నేపధ్యంలో నిర్వహించనున్న మోడి సభ సన్నాహక సమావేశం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ ప్రాంగణంలో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డివిజన్ ఇన్చార్జి కె.నాగేశ్వర్ రెడ్డి, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ… ఈ నెల 10 వ తేదీన సాయంత్రం 4:00 గంటలకు సికింద్రాబాద్‌లోని పెరెడ్ గ్రౌండ్స్ మైదానంలో జరగబోయే జన ఆగ్రహ సభ కు ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేయనున్న సందర్భంగా గాంధీనగర్ డివిజన్ నుండి భారీ జన సామీకరణతో బయలుదేరి వెళ్లి మోడీకి ఘన స్వాగతం పలికాలన్నారు. సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సన్నాహక సమావేశంలో బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్‌రావు, శ్రీనివాస్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్,ఎం.ఉమేష్,శివ కుమార్, సత్తి రెడ్డి, బిజెపి బూత్ అధ్యక్షులు, మహిళా నాయకులు, అన్ని మోర్చల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.













Leave a Reply