ఉత్సాహంగా న్యూ ఎరా కళాశాల సంకల్ప్ దివాస్
హైదరాబాద్, ఆగస్టు 26, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లిలోని న్యూ ఎరా కళాశాల సంకల్ప్ దివాస్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. బాగ్‌లింగంపల్లి విఎస్‌టి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాంప్ వాక్ లు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ రాజు నాయక్ హాజరై మాట్లాడుతూ… ఉన్నత లక్ష్యంతో విద్యార్థులు ముందుకు సాగాలని, ఆరేళ్లు కష్టపడి చదివితే 60 సంవత్సరాలు సంతోషంగా ఉండవచ్చన్నారు. అనంతరం సిఐ రాజునాయక్ ను న్యూఎరా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.శ్రావణ్ కుమార్ సత్కరించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply