మాజీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పెన్షన్ ఇవ్వాలి
♦ పలువురు వక్తల డిమాండ్
హైదరాబాద్, అద్దం న్యూస్ : మాజీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పెన్షన్ ఇవ్వాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ 73, 74 చట్టాలకు జాతీయ హోదా దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మంచాల వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా దక్షిణాది బిసి, ఎస్సీ, ఎస్టీ జెఎసి అధ్యక్షుడ, ప్రొఫెసర్ గాలి వినోద్, పూర్వ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, తెలంగాణ ఉద్యమకారుల జెఎసి ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి, సెక్రటరి జనరల్ తుమ్మల ప్రఫూల్‌రాంరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మంచాల వెంకటస్వామి మాట్లాడుతూ… స్థానిక సంస్థలకు 29 అధికారాల్లో సగం ఇచ్చిన పేద ప్రజలకు లాభం జరిగేందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11 అధికారాలను మాత్రమే ఇచ్చిందని, కనీసం 20 అధికారాలను ఇచ్చినా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూలన జరిగేదన్నారు. చట్టాలను బదలాయించడంలో, స్తానిక సంస్థల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వివక్షతను చూపిస్తున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు జీవితకాలం పెన్షన్ ఇచ్చిన విధంగానే మాజీ సర్పంచులకు, మాజీ ఎంపిటిసీలకు, మాజీ జెడ్‌పిటిసలకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రావాల్సిన పెండింగ్ బిల్లులను ఇవ్వాలని, ఉచితంగా బస్ పాస్‌లను ఇవ్వాలని, పెన్షన్ ఇవ్వాలని, హెల్త్ కార్డులను ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా దక్షిణాది బిసి, ఎస్సీ, ఎస్టీ జెఎసి అధ్యక్షుడ, ప్రొఫెసర్ గాలి వినోద్, పూర్వ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, తెలంగాణ ఉద్యమకారుల జెఎసి ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి, సెక్రటరి జనరల్ తుమ్మల ప్రఫూల్‌రాంరెడ్డిలు మాట్లాడారు. ఈ సమావేశంలో సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ యునైటెడ్ ఫోరం ప్రధాన కార్యదర్శి ఏషబోయిన రాజన్న యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగరయ్య గౌడ్, మాజీ ఎంపిటిసి సంఘం మహిళా అధ్యక్షురాలు అంబటి తులసి, కోశాధికారి బైండ్ల భూపతి, ప్రసాద్, సుభాషిణి, ప్రస్తుత సర్పంచ్‌ల జెఎసి ఛైర్మన్ సూరన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply