పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగంలో అంతరాయం

పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగంలో అంతరాయం

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ62 (PSLV-C62) రాకెట్ ప్రయోగంలో సాంకేతిక అంతరాయం ఏర్పడింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ప్రయోగం ప్రారంభమైంది. అయితే ఈ ప్రయోగంలో పలు ఇబ్బందులు ఎదురైనట్లు ఇస్రో ఛైర్మన్‌ వి. నారాయణన్‌ వెల్లడించారు. రాకెట్‌ ప్రయోగం మూడో దశ వరకు సాఫీగా సాగినట్లు తెలిపారు. ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు. పరిస్థితిని విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు.

దేశ రక్షణ రంగానికి అవసరమైన సమాచారాన్ని అందించే లక్ష్యంతో ‘ఈఓఎస్‌-ఎన్‌1’ (EOS-N1) అనే అత్యాధునిక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ఉపగ్రహం సరిహద్దుల పర్యవేక్షణ, రక్షణ సంబంధిత నిఘా వ్యవస్థలకు అత్యంత కీలకం. మిషన్ నియంత్రణ కేంద్రం (MCC) నుంచి అందుతున్న సిగ్నల్స్ ఆధారంగా శాస్త్రవేత్తలు లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలను ఇస్రో త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page