...

ప్రపంచ పర్యావరణ సంస్థను అభినందించిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి

 

ప్రపంచ పర్యావరణ సంస్థను అభినందించిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి

 

పుదుచ్చేరి, అద్దం న్యూస్ :   పుదుచ్చేరి ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు రంగస్వామి త‌న స్వగృహంలో ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణ జీవజాతి సంరక్షణ కోసం మన ప్రపంచ పర్యావరణ సమస్య చేస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి మాట్లాడుతూ… ఈ రోజులలో ఇటువంటి సమస్యను చూడడం చాలా ఆశ్చర్యంగా ఉందని పుదుచ్చేరి ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు రంగస్వామి అన్నారు. ఈ భూమి మీద జీవజాతిని, వృక్షజాతిని, మానవజాతిని, జంతు జాతిని, జీవవైవిద్యాన్ని కాపాడటమే లక్ష్యంగా పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులను చైతన్య పరుస్తూ ప్రపంచ పర్యావరణ సంస్థ పర్యావరణ పరిరక్షణ ఏకమవుదాం రండి అన్న ఏకైక నినాదంతో పని చేయడం నిజంగా ఎంతో గొప్ప విషయం అన్నారు. ఇటువంటి సమస్యతో కలిసి మా ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేశారు. భవిష్యత్తులో పుదిచ్చేరి కేంద్ర పాలిత రాష్ట్రాన్ని పర్యావరణ పరిరక్షణ అనుకూలమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం మన ప్రపంచ పర్యావరణ సంస్థ దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో ఏ సమస్త చేయలేనని కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షలాది మొక్కలు నాటుతూ వేలాది కార్యక్రమాలను నిర్వ‌హించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. టాక్స్ ఫైలింగ్ ఇండియా సంస్థ చైర్మన్ చల్లూరి శ్రీనివాస్ సహకారంతో నిర్వహిస్తూ ప్లాస్టిక్ వ్యతిరేకంగా దాదాపుగా రెండు నుంచి ఐదు లక్షల క్లాస్ బ్యాగులను పంచిపెట్టి ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరు తమ విద్యార్థి దశలో తమ పుట్టినరోజు, తమ వివాహ దినోత్సవ వేడుకలలో, తమ పూర్వికులు చనిపోయిన వర్ధంతి దినోత్సవాల్లో మొక్కలని బహుమతులుగా సమర్పించాలని సూచించారు గ్రేటర్ హైదరాబాద్ రికగ్నేషన్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ చైర్మన్ తమ్మినేని సత్యనారాయణ మాట్లాడుతూ… ప్రతి పాఠశాల విద్యార్థి ప్రపంచ పర్యావరణ సంస్థ చెబుతున్న సూత్రాలను తప్పకుండా పాటించడానికి మీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని, అందుకోసం ప్రతి విద్యార్థి కనీసం తన పాఠశాల విద్య కాలంలో కనీసం 10 మొక్కలు నాటాలని వాటిని పరిరక్షించాలని అన్ని వేదికల మీద పర్యావరణానికి అనుకూలమైన విద్యార్థులను తయారు చేయాలని అందుకు పుదుచ్చేరి ప్రభుత్వం సంపూర్ణ సహయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రిని కోరామ‌న్నారు. పుదుచ్చేరి భారతదేశంలోనే ప్రపంచంలోనే ఎంతో సుందరమైన ప్రదేశం ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తార‌ని… ప్ర‌తి పర్యాటకుడు పర్యాటకురాలు కనీసం ఒక మొక్కను నాటి అందమైన మన పుదిచ్చేరిని నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ సంస్థ పాండిచ్చేరి రాష్ట్ర కో– ఆర్డినేటర్ సురేష్, ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రధాన కార్యదర్శి నిఖిల్, కోశాధికారి రిజ్వాన్, సహాయ కార్యదర్శి రాజేష్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.